శంషాబాద్: ఔటర్‌రింగ్ రోడ్డు వద్ద లారీ, డీసీఎం ఢీ కొని ముగ్గురికి గాయాలైన ఘటన గురువారం శంషాబాద్ ఆర్జీఐఏ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం… ఔటర్‌రింగ్ రోడ్డుపై ఘట్కేసర్ నుంచి గచ్చిభౌలికి ఓ లారీ బయలుదేరింది. శంషాబాద్ పరిధిలో ఉన్న ఔటర్‌రింగ్ రోడ్డు 16 వ ఎగ్జిట్ వద్ద ఆగిఉంది. హఠాత్తుగా ఓ డిసీఎం వెనుక నుంచి వేగంగా దూసుకువచ్చి అదుపుతప్పి లారీ ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు ఆర్జీఐఏ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.