Kolkata Gang Rape : దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన కోల్‌కతా లా కాలేజీ స్టూడెంట్ గ్యాంగ్ రేప్ (Kolkata Gang Rape) కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బాధితురాలు తన ఫిర్యాదులో ప్రధాన నిందుతుడు మనోజిత్ మిశ్రా (Manojit Mishra) గురించి షాకింగ్ వాస్తవాలు చెప్పింది. పెళ్లికి అంగీకరించలేదనే అక్కసుతో తనను బ్లాక్ మెయిల్ చేశాడని.. వదిలేయాలని ఎంత వేడుకున్నా సరే వదల్లేదని వాపోయింది 24 ఏళ్ల బాధితురాలు.
మనోజిత్ నన్ను పెళ్లి చేసుకోవాలంటూ పులమార్లు వేధించాడు. శృంగారంలో పాల్గొనాల్సిందిగా నన్ను తరచూ బలవంతం చేసేవాడు. కానీ, నేను తలొగ్గలేదు. అతడిని ఎదిరించాను. బలాన్నంత కూడదీసుకొని గట్టిగా వెనక్కి తోసేశాను. అయినా సరే అతడు రాక్షసుడిలా ప్రవర్తించాడు. నన్ను వదిలేయాలని ఏడ్చాను. కాళ్లు పట్టుకొని బతిమిలాడాను. నాకు బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడని.. అతడితోనే జీవితాన్నిఊహించుకుంటున్నానని చెప్పాను. కానీ, మనోజిత్ నా పట్ల పశువులా ప్రవర్తించాడు.
🔴 RAPE IN A REPUTED LAW COLLEGE IN KOLKATA BY A TMC LEADER
Another shameful chapter has been added to Bengal’s collapsing law and order under TMC rule.
▶️ A female student of a prestigious law college in South Kolkata was brutally gang-raped—not in some dark alley, but right… pic.twitter.com/PFVpEOR7Mj
— Amit Malviya (@amitmalviya) June 27, 2025
నన్ను బలవంతంగా గార్డ్ రూమ్‌లోకి తీసుకెళ్లి.. సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు అని బాధితురాలు తన ఫిర్యాదులో వెల్లడించింది. అంతేకాదు.. తనను వాళ్లు ఆస్ప్రతికి కూడా తీసుకెళ్లేందుకు నిరాకరించారని.. ప్రధాన గేటుకు తాళం వేసి వెళ్లారని బాధితురాలు తెలిపింది. వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేశారని ఆమె తన కంప్లైంట్లో పేర్కొంది.
లా కాలేజీ మాజీ విద్యార్థి అయిన మనోజిత్ ప్రస్తుతం తృణమూల్ కాంగ్రెస్ విద్యార్థి విభాగానికి జనరల్ సెక్రటరీగా ఉన్నాడు. అతడు బాధితురాలిని పెళ్లి చేసుకోవాలని తరచూ వేధించేవాడు. కానీ, ఆమె అంగీకరించలేదు. తనకు బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడని చెప్పినా వినకుండా పలుమార్లు బెదిరింపులకు పాల్డడ్డాడు మనోజిత్. అంతేకాదు బాధితురాలి ప్రియుడికి హాని తలపెడుతానని, ఆమె కుటుంబ సభ్యులను తప్పుడు కేసులో ఇరికించి పోలీసులకు పట్టిస్తానని ఇలా ఆమెను భయపెట్టాడు. ఈ విషయాల గురించి మాట్లాడుదాం ఆమెను జూన్ 25న కాలేజీ లోపలికి రావాలని కోరాడు.
Kolkata Gang-Rape: Law Student Gangraped in College, TMC Leader, Two Students Arrested
How @sagarikaghose gonna defend Mamata this time? pic.twitter.com/kVED2o0ZEX
— Lala (@Lala_The_Don) June 27, 2025
అయితే.. అక్కడికి వెళ్లాక మనోజిత్ మరో ఇద్దరి విద్యార్ధులు కలిసి ఆ అమ్మాయిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన ఆ రోజు రాత్రి 7:30 గంటల నుంచి రాత్రి10:50 మధ్య జరిగినట్టు పోలీసులకు బాధితురాలు తెలిపింది. ప్రధాన నిందితుడు మనోజిత్, అతడికి సహకరించిన జైబ్ అహ్మద్‌ను జూన్ 26న అరెస్ట్ చేశారు. మూడో నిందితుడు ప్రమిత్ ముఖర్జీని శుక్రవారం అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ముగ్గురి ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.