న్యూఢిల్లీ : ఎస్కార్ట్ జాబ్‌ల ఆశ చూపి యువకులను మోసగిస్తున్న అంతరాష్ట్ర ముఠా గుట్టును ఢిల్లీ పోలీసులు రట్టు చేశారు. ఈ ఘటనలో నలుగురు మహిళలు సహా ఆరుగురు సైబర్ ఫ్రాడ్స్టర్స్ను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి మొబైల్ ఫోన్లు, సిమ్ కార్డులు, డెబిట్ కార్డులను సీజ్ చేశారు.
నిందితులు గిగోలోక్లబ్, ప్లేబాయ్క్లబ్ పేరుతో నకిలీ మొబైల్ నెంబర్లతో నిందితులు రెండు వెబ్సైట్లను ప్రారంభించారు. ఎస్కార్ట్ జాబ్‌ల కోసం ఈ వెబ్సైట్లను ప్రారంభించిన నిందితులు ఏడాదిగా అంతరాష్ట్ర రాకెట్‌ను నడుపుతూ పలువురిని రూ 2 కోట్ల వరకూ మోసగించారు.
ఈ వెబ్‌సైట్‌ను చూసిన వారు జాబ్ కోసం కాల్ చేస్తే వారి నుంచి రిజిస్ట్రేషన్ ఫీజు కింద రూ 2000 వసూలు చేసేవారు. ఆపై హోటల్ చార్జీలు, మెడికల్ చార్జీల పేరుతో అందినంత గుంజుతారు. డబ్బు వసూలు చేసిన తర్వాత బాధితుల మొబైల్ నెంబర్లను బ్లాక్ చేస్తుంటారు. నిందితులను అమిత్ గాంధీ, ఆయన భార్య మహి గాంధీ, జై కొచర్, హర్మన్ కౌర్, లిష, రంజనా సింగ్‌గా గుర్తించారు.