ముంబై : తనతో సన్నిహిత సంబంధానికి నిరాకరించిందనే కోపంతో యువకుడు (22) బాలిక (17)ను పలుమార్లు కత్తితో పొడిచిన ఘటన మహారాష్ట్రలోని పుణేలో వెలుగుచూసింది. బాలికపై కత్తితో దాడి చేసి ఊపిరిఆడకుండా చేసేందుకు యత్నించిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని చందన్నగర్కు చెందిన ధ్యానేశ్వర్ నింబల్కర్గా గుర్తించారు.
నిందితుడు చందన్నగర్లోని ఖులేవాది ప్రాంతంలో శుక్రవారం బాలిక నడుము, ఛాతీ, కాళ్లపై కత్తిపోట్లతో విరుచుకుపడ్డాడు. తీవ్ర గాయాలైన బాలికను స్ధానిక ఆస్పత్రికి తరలించగా ప్రస్తుతం కోలుకుంటోంది. ధ్యానేశ్వర్పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. తాను ఫోన్ చేసినా ఎందుకు స్పందించలేదని, తనను కలిసేందుకు ఎందుకు నిరాకరిస్తున్నావని నిందితుడు బాలికను నిలదీశాడని ఈ విషయమై ఘర్షణ చెలరేగడంతో బాలికపై దాడి చేశాడని పోలీసులు తెలిపారు.
నిందితుడి నుంచి కత్తితో పాటు సెల్ఫోన్ స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. గతంలో నిందితుడు, బాలిక మధ్య పరిచయం ఉందని ఇటీవల కొద్దిరోజులుగా బాలిక నిందితుడిని దూరం పెట్టిందని తెలిపారు. బాలికపై దాడికి తెగబడేముందు తనతో సన్నిహితంగా ఉండాలని కోరుతూ బెదిరింపులకు గురిచేశాడని చెప్పారు.