ముంబై : భర్తతో విభేదాలతో పుట్టింటికి వచ్చిన కూతురిని తిరిగి కాపురానికి వెళ్లాలని కోరినందుకు కూతురితో కలిసి భర్తను హత్య చేసిన మహిళ ఉదంతం మహారాష్ట్రలోని కళ్యాణ్‌లో వెలుగుచూసింది. గురువారం రాత్రి విధులు ముగించుకుని ఇంటికి వచ్చిన ప్రకాష్ బోర్సే (55) భర్తతో విడాకులు కోరుతున్న కూతురి (26)కి నచ్చచెప్పేందుకు పూనుకున్నాడు.
కుటుంబంలో ఇదే విషయమై తరచుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో తండ్రీ, కూతురు మధ్య ఘర్షణ చెలరేగింది. ప్రకాష్ తీరుతో ఆగ్రహంతో ఊగిపోయిన భార్య జ్యోతి (47) పదునైన ఆయుధంతో దాడి చేసింది. కూతురు కూడా తండ్రిని తీవ్రంగా కొట్టడంతో బాధితుడు అపస్మారకస్ధితిలోకి వెళ్లాడు.
స్ధానికులు బాధితుడిని ఆస్పత్రికి తీసుకువెళ్లగా అప్పటికే మరణించినట్టు వైద్యులు నిర్ధారించారు. కేసు నమోదు చేసిన పోలీసులు తల్లీకూతుళ్లను అరెస్ట్ చేశారు.