కట్నం కోసం బరితెగింపు : భార్య నగ్న చిత్రాలు తీసి బెదిరింపులు!
కట్నం కోసం ఓ వ్యక్తి (32) భార్య (29)ను చిత్రహింసలకు గురిచేసిన ఘటన తమిళనాడులోని కోయంబత్తూర్‌లో వెలుగుచూసింది.
కోయంబత్తూర్ : కట్నం కోసం ఓ వ్యక్తి (32) భార్య (29)ను చిత్రహింసలకు గురిచేసిన ఘటన తమిళనాడులోని కోయంబత్తూర్‌లో వెలుగుచూసింది. కట్నం కింద కొత్త ఇల్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆపై భార్య నగ్నచిత్రాలను తీసి బెదిరించాడు. మహిళ ఫిర్యాదు ఆధారంగా నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బాధితురాలు నగరంలోని ఓ ప్రైవేట్ బ్యాంక్‌లో జూనియర్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తుండగా 2020 అక్టోబర్ 29న సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేసే పిచ్చైముత్తును పెండ్లి చేసుకుంది.
వివాహ సమయంలో మహిళ తల్లితండ్రులు కట్నం కింద బంగారు ఆభరణాలతో పాటు రూ 5 లక్షలు అత్తింటి వారికి ముట్టచెప్పారు. ఆపై పెండ్లయిన కొద్దిరోజులకే నిందితుడు భార్యతో కాపురం చేయనని, ఆమె ముఖంపై మొటిమలున్నాయని వేధింపులకు గురిచేశాడు. ఈ విషయం అత్తామామలకు చెప్పగా సర్ధిచెప్పాల్సిన వారు అదనపు కట్నం కింద కొత్త ఇల్లు కావాలని డిమండ్ చేశారు.
నిందితుడు బలవంతంగా భార్య దుస్తులు తొలగించి నగ్న చిత్రాలు తీశాడు. అసభ్య చిత్రాలను చూపి ఆమెను బెదిరింపులకు గురిచేసేవాడు. ఆపై భార్యను లైంగిక వేధింపులకు గురిచేయడంతో పాటు అత్తింటి వారు ఆమెను శారీరకంగా హింసించడంతో చికిత్స నిమిత్తం కోయంబత్తూరు బోధనాసుపత్రికి తరలించారు. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా నిందితుడు పిచ్చైముత్తును అరెస్ట్ చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
- Tags
- arest
- molestation
- tamilnadu
- techie
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

