చండీఘడ్ : హర్యానాలో దారుణం జరిగింది. ఆరేండ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడి హత్య చేసిన ఉదంతం పానిపట్లో కలకలం రేపింది. బాలిక మృతదేహాన్ని నిందితుడు పొదల్లో పడవేయడం సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా బాలిక మృతదేహం చిన్న కాలువలో లభ్యమైంది.
బాలిక సోదరుడు తన చెల్లెలిని ఓ వ్యక్తి కిడ్నాప్ చేయడం చూసి కుటుంబ సభ్యులను అప్రమత్తం చేశాడు. ఆపై బాలిక కోసం గాలించిన కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు బృందాలుగా విడిపోయి గాలిస్తున్నారు. తదుపరి దర్యాప్తును వేగవంతం చేశామని పోలీసులు చెప్పారు.