కొండాపూర్ : బ్రతకడానికి వెళ్తున్నా… నన్ను వెతకద్దూ… అంటూ ఓ యువతి డైరీలో రాసిపెట్టి ఇంటి నుంచి వెళ్ళిపోయిన సంఘటన చందానగర్ పోలీస్ స్టేష న్ పరిధిలో చోటు చేసుకుంది. చందానగర్ సీఐ క్యాస్ట్రో తెలిపిన వివరాల ప్రకారం… వికారాబాద్ జిల్లా బషీరాబాద్ కు చెందిన అకార్ దేవికారాణి, రాజేశం దంప తులు బ్రతుకుదెరువు నిమిత్తం నగరానికి వలస వచ్చి స్థానికంగా పాపిరెడ్డి కాలనీలో నివాసం ఉంటున్నారు. దేవికారాణి, రాజేశం కూతురు ఉజ్జయిని (18), డిగ్రీ చదువుతుంది.
ఈనెల 6న తండ్రి మందలించడంతో డైరీలో ‘మమ్మీ నేను బ్రతకడానికి వెళ్ళుచున్నాను నన్ను వెతక కూడదు’ అని రాసిపెట్టి కొన్ని బట్టలు తీసుకుని ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. ఈ మేరకు తల్లి దేవికారాణి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఉజ్జయినికి సంబంధించిన ఆచూకీ తెలిసిన వారు డయల్100కు గానీ 040-27853911, 9490617118, 7901110877 నెంబర్లకు సమాచారం అందించాల్సిందిగా తెలిపారు.