రంగారెడ్డి : శంషాబాద్ ఎయిర్‌పోర్టులో స్మగ్లింగ్ సిగరెట్లను కస్టమ్స్ అధికారులు భారీగా స్వాధీనం చేసుకున్నారు. రూ. 9.72 లక్షల విలువ చేసే 80 వేల విదేశీ సిగరెట్లను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. దుబాయ్ నుంచి వచ్చిన నలుగురి వద్ద ఈ సిగరెట్లను గుర్తించి, వారిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వీరిని శంషాబాద్ ఎయిర్‌పోర్టు పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
కామారెడ్డి జిల్లాలోని భిక్కనూరు టోల్ ప్లాజా వద్ద భారీగా గుట్కాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రూ. 15 లక్షల విలువ చేసే గుట్కాను స్వాధీనం చేసుకుని, ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. బీదర్ నుంచి ఆదిలాబాద్‌కు గుట్కాను తరలిస్తున్నట్లు పోలీసులు నిర్ధారించారు.