గురుగ్రాం : తుపాకీతో బెదిరించి నలుగురు వ్యక్తులు లిక్కర్ షాప్‌లో లూటీకి పాల్పడిన ఘటన గురుగ్రాంలోని శివాజీ నగర్లో వెలుగుచూసింది. పోలీస్ కమిషనర్ కార్యాలయానికి సమీపంలో ఈ ఉదంతం చోటుచేసుకోవడం కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆదివారం రాత్రి మద్యం దుకాణానికి వచ్చిన వ్యక్తి బీరు కావాలని సేల్స్‌మెన్‌ను అడిగాడు. బీరు తెచ్చేందుకు అతడు ర్యాక్ వద్దకు వెళ్లగా ఈ లోగా కౌంటర్లో ఉన్న రూ 40,000ను లూటీ చేసేందుకు నిందితుడు ప్రయత్నించాడు.
సేల్స్‌మెన్ అభ్యంతరం వ్యక్తం చేయగా మరో ముగ్గురు వ్యక్తులు అక్కడుకు చేరుకుని తుపాకీతో భయపెట్టి డబ్బు తీసుకుని పరారయ్యారు. నిందితులు ఘటనా స్ధలం నుంచి వెళుతూ భయపెట్టేందుకు కాల్పులు జరిపారని సేల్స్‌మెన్ పోలీసులకు తెలిపాడు. సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించగా నిందితులు మద్యం దుకాణాన్ని లూటీ చేసిన అనంతరం తెలుపు రంగులో పరారయ్యారని వెల్లడైంది. నలుగురు నిందితులపై శివాజీనగర్ పోలీస్ స్టేషన్లలో పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది.