కాల్పుల కలకలం.. తుపాకీతో బెదిరించి రూ.2లక్షలు దోపిడీ
gun firing | శామిర్‌పేటలో సోమవారం రాత్రి కాల్పులు కలకలం సృష్టించాయి. తుపాకీతో బెదిరించి రూ.2లక్షలను గుర్తు తెలియని దొండగులు దోపిడీ చేశారు. మూడుచింతలపల్లి మండలం ఉద్దెమర్రిలో ఈ ఘటన చోటు చేసుకున్నది.
హైదరాబాద్ : శామిర్‌పేటలో సోమవారం రాత్రి కాల్పులు కలకలం సృష్టించాయి. తుపాకీతో బెదిరించి రూ.2లక్షలను గుర్తు తెలియని దొండగులు దోపిడీ చేశారు. మూడుచింతలపల్లి మండలం ఉద్దెమర్రిలో ఈ ఘటన చోటు చేసుకున్నది. గ్రామంలోని వైన్స్ వద్దకు రాత్రి మాస్క్‌లు ధరించి వచ్చిన ముగ్గురు దుండగులు వచ్చారు. క్యాషియర్‌తో పాటు మరో ఇద్దరిపై కర్రలతో దాడి చేశారు. మద్యం దుకాణం సిబ్బంది తిరగబడడంతో తుపాకీతో దుండగులు కాల్పులు జరిపారు.
సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించడంతో తూటా షట్టర్‌కు తగిలింది. ఆ తర్వాత డబ్బులతో పరారవుతుండగా.. సిబ్బంది కేకలు వేశారు. నిందితులు పారిపోతూ గాల్లోకి కాల్పులు జరిపారు. దుకాణ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా నిందితులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vijay TVK | ఇండియా బ్లాక్ నిరసనల్లో చేరనున్న విజయ్ టీవీకే పార్టీ.. వెల్లడించిన వీసీకే నేత
ఇంత చేతకాని సీఎం ఎవరైనా ఉంటారా? : మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్
Gadwal | గద్వాలలో భారీ వర్షం..మారిన వాతావరణంతో ఉపశమనం
అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలి : కలెక్టర్ అంకిత్
Besan Flour | షాపుల్లో శనగపిండి వద్దు.. ఇంట్లోనే ఇలా సులభంగా తయారు చేయొచ్చు..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

