Fire Accident | హైదరాబాద్ నగర పరిధిలోని వనస్థలిపురం వద్ద శుక్రవారం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. వనస్థలిపురంలోని పనామా వీడెం ఫర్నీచర్ షోరూమ్ లో మంటలు అంటుకున్నాయి. భారీ ఎత్తున మంటలు చెలరేగడంతో స్థానిక ప్రజలు భయంతో ఆందోళనకు గురయ్యారు.
ఈ ఘటన సమాచారం తెలియగానే అగ్ని మాపక దళ సిబ్బంది మూడు ఫైరింజన్లతో ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పడానికి ప్రయత్నిస్తున్నారు. దీంతో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై కొద్దిగా ట్రాఫిక్ జామ్ అయింది. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉన్నది. ఘటన సమాచారం తెలియగానే పోలీసు అధికారులు, పౌర అధికారులు అక్కడికి చేరుకుని పరిస్థితులు సమీక్షిస్తున్నారు.