పిల్లలపై తల్లిదండ్రుల ప్రేమ వెలకట్టలేనిదని అంటారు. కానీ ఒక తండ్రి చాలా చిన్న విషయంలో కుమారుడితో గొడవపడి అతన్ని చంపేశాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని డామో జిల్లాలో వెలుగు చూసింది. స్థానికంగా బొబాయ్ ప్రాంతంలో నివశించే మోటీ కచ్చి (52) అనే వ్యక్తి నివశిస్తున్నాడు.
కొడుకు సంతోష్‌తో గురువారం నాడు అతనికి గొడవైంది. తమ్ముడు రామ్ కిషన్‌తో కలిసి వచ్చి బైక్ తాళాలు ఇవ్వాలని కచ్చి అడిగాడు. సంతోష్ ఇవ్వనన్నాడు. దీంతో అన్నదమ్ములిద్దరూ కలిసి సంతోష్‌తో గొడవ పడి కొట్టారు. అయినా సంతోష్ బైక్ తాళాలు ఇవ్వకుండా, వాళ్లతో గొడవపడ్డాడు. ఈ క్రమంలో పక్కనే కనిపించిన ఒక గొడ్డలి తీసుకొన్న కచ్చి.. సంతోష్ ఎడమచెయ్యి నరికేశాడు.
అది చూసిన సంతోష్ భార్య భయంతో వణికిపోయింది. భర్తను వెంటనే స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తీసుకెళ్లింది. అతని పరిస్థితి గమనించిన వైద్యులు.. జబల్పూర్కు సంతోష్‌ను రిఫర్ చేశారు. అక్కడకు వెళ్లే దారి మధ్యలోనే అతని ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. అదే సమయంలో సంతోష్ చెయ్యితోపాటు గొడ్డలి కూడా తీసుకొని నేరుగా పోలీస్ స్టేషన్ వచ్చిన కచ్చి లొంగిపోయాడు. అతనిపై హత్యానేరం కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.