అమరావతి : ఏపీలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ( Road Accident) ఇద్దరు మృతి చెందారు. మరో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. విజయనగరం(Vijayanagaram) జిల్లా మదుపాడ సమీపంలోని జాతీయ రహదారిపై ఆగిఉన్న లారీని ప్రైవేట్ బస్సు ( Private Bus ) వెనుక నుంచి ఢీ కొట్టింది.
ఈ ప్రమాదంలో ఐదేళ్లలోపు చిన్నారితో పాటు మరో ప్రయాణికుడు మృతి చెందాడు. మరో 15 మందికి గాయాలు కాగా ఐదుగురి పరిస్థితి విషమంగా మారింది. ప్రయాణికులు 2 గంటల పాటు బస్సులోనే చిక్కుకోవడంతో పోలీసులు క్రేన్ సాయంతో బస్సును బయటకు తీసి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 41 మంది ప్రయాణిస్తున్నారని పోలీసులు వివరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.