కొమురంభీం ఆసిఫాబాద్ : జిల్లాలోని దహేగాంలో నకిలీ విత్తనాలను పోలీసులు పట్టుకున్నారు. రూ. 17 లక్షల విలువైన 850 కిలోల నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. నకిలీ పత్తి విత్తనాలు తరలిస్తున్న పెద్దపల్లి జిల్లాకు చెందిన ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
రూ.6 కోట్ల విలువైన నకిలీ పత్తి, వరి, మొక్కజొన్న, కూరగాయల విత్తనాలు తయారు చేసి విక్రయిస్తున్న 13 మంది సభ్యుల అంతర్రాష్ట్ర ముఠాను నల్లగొండ జిల్లా పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. మరొక ఘటనలో పెద్దపల్లి జిల్లా మంథని పోలీస్ స్టేషన్ పరిధి ఉప్పట్ల గ్రామంలో బ్లాక్లో పత్తి విత్తనాలు అమ్ముతున్న కాశెట్టి రవి అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుండి 48 పత్తి విత్తన ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు.