Crime News | బెంగళూర్ : ఓ టెక్నాలజీ కంపెనీలోకి చొరబడిన మాజీ ఉద్యోగి కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవోలను దారుణంగా హత్య చేసిన ఘటన బెంగళూర్లో కలకలం రేపింది. గతంలో తాను పనిచేసిన టెక్ కంపెనీ కార్యాలయంలోకి చొచ్చుకువచ్చిన దుండగుడు ఉన్నతాధికారులపై కత్తితో దాడి చేశాడు.
ఈ ఘటనలో ఏరోనిక్స్ ఇంటర్నెట్ కంపెనీ ఎండీ ఫణింద్ర సుబ్రమణ్యం, సీఈవో విను కుమార్లు ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించారు. దాడిచేసిన వ్యక్తిని ఫెలిక్స్గా గుర్తించగా ప్రస్తుతం అతడు పరారీలో ఉన్నాడని బెంగళూర్ నార్త్ఈస్ట్ డీసీపీ లక్ష్మీ ప్రసాద్ వెల్లడించారు.
ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు వెలుగు చూడాల్సి ఉంది. కాగా, టెక్నాలజీ కంపెనీలో చోటుచేసుకున్న అనూహ్య ఘటనతో ఐటీ సీటీ ఉలిక్కిపడింది. జంట హత్యలపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
Read More :
Foxconn-Vedanta | సెమీ కండక్టర్ల తయారీ డౌటేనా..? వేదాంతతో ఫాక్స్ కాన్ దోస్తీ కటీఫ్..!