గువహటి : పోలీసుల కండ్లు కప్పి ట్రక్కు, కార్లలో రూ కోట్ల విలువైన డ్రగ్స్‌ను అక్రమంగా తరలిస్తున్న మూడు అంతరాష్ట్ర డ్రగ్ ముఠాలను అసోం పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్‌తో పాటు ఓ ట్రక్కు, ఐ20 కారును సీజ్ చేశారు.
జాయింట్ కమిషనర్ పార్ధసారధి మహంత నేతృత్వంలో చేపట్టిన ఆపరేషన్‌లో ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారని అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ గురువారం వరుస ట్వీట్లలో వెల్లడించారు. నిందితుల నుంచి పెద్దమొత్తంలో నగదు, మొబైల్ ఫోన్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురు డ్రగ్ డీలర్ల నుంచి 70,000 వరల్డ్ ఈజ్ యువర్స్ ట్యాబ్లెట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.