మద్యం మత్తులో డ్రైవర్.. చిన్నారులపై దూసుకెళ్లిన కారు
Delhi | ఓ డ్రైవర్ మద్యం మత్తులో కారును అతి వేగంగా నడిపాడు. కారు అదుపుతప్పి ఓ ముగ్గురు పిల్లలపైకి దూసుకెళ్లింది. దీంతో చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన ఢిల్లీలోని గులాబీ బాగ్‌లో ఇవాళ ఉదయం చోటు చేసుకుంది.
న్యూఢిల్లీ : ఓ డ్రైవర్ మద్యం మత్తులో కారును అతి వేగంగా నడిపాడు. కారు అదుపుతప్పి ఓ ముగ్గురు పిల్లలపైకి దూసుకెళ్లింది. దీంతో చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన ఢిల్లీలోని గులాబీ బాగ్‌లో ఇవాళ ఉదయం చోటు చేసుకుంది.
ఢిల్లీలోని గులాబీ బాగ్‌లో ఓ 30 ఏండ్ల యువకుడు తన మారుతి బ్రీజా కారులో వేగంగా వెళ్తున్నాడు. అంతలోనే కారు అదుపుతప్పి ఫుట్‌పాత్‌పైకి దూసుకెళ్లింది. ఆ ఫుట్‌పాత్‌పై ఉన్న ముగ్గురు పిల్లలకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదానికి కొంచెం దూరంలో కారును ఆపిన యువకుడిని స్థానికులు అదుపులోకి తీసుకున్నారు. కారు డ్రైవర్‌ను స్థానికులు చితకబాది, అనంతరం పోలీసులకు అప్పగించారు. గాయపడ్డ చిన్నారులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. 10, 4 ఏండ్ల వయసున్న ఇద్దరు పిల్లలకు స్వల్ప గాయాలు కాగా, 6 ఏండ్ల వయసున్న మరో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి.
కారు డ్రైవర్‌ను ప్రతాప్‌నగర్‌కు చెందిన గజేందర్గా పోలీసులు గుర్తించారు. అయితే అంతకు ముందు కూడా గజేందర్ వేగంగా కారు నడిపినట్లు స్థానికులు పేర్కొన్నారు. మెల్లగా నడపాలని హెచ్చరించినప్పటికీ అతను వినిపించుకోలేదన్నారు. డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు తెలిపారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
కేసీఆర్‌పై ‘వెలుగు’ దుష్ప్రచారం.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి: జర్మనీ బీఆర్ఎస్ డిమాండ్
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్‌ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

