దోమ : కడుపునొప్పి బాధ భరించలేక పురుగుల మందు తాగి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఓ వివాహిత మృతి చెందిన ఘటన దోమ మండల పరిధిలోని మోత్కూర్ గ్రామంలో చోటు చేసుకున్నది. ఎస్సై రమేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా దర్గూడెం మండలం గుంజల్పహాడ్ గ్రామానికి చెందిన బాబుమియా కూతురు పర్వీనాభేగం (29)ని 14 సంవత్సరాల క్రితం దోమ మండం మోత్కూర్ గ్రామానికి చెందిన ఖధీర్కు ఇచ్చి వివాహం చేశారు. కొన్ని సంవత్సరాలుగా బాగానే ఉన్న ఇటీవల తరచుగా కడుపునొప్పి మొదలైంది.
మూడు రోజుల క్రితం కడుపుప్పి అతిగా రావడంతో బాధ తట్టుకోలేక పురుగుల మందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స కోసం నగరంలోని ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తుండగా గురువారం రాత్రి మృతి చెందింది. మృతురాలికి ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతురాలి తండ్రి బాబుమియా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రమేశ్ తెలిపారు.