మహాముత్తారం : అక్రమంగా బోలేరో వాహనంలో తరలిస్తున్న ఆరు టేకు దుంగలను అటవీశాఖ అధికారులు సింగంపల్లి గ్రామ సమీపంలో శనివారం ఉదయం 6 గంటలకు పట్టుకున్నారు. అనంతరం మహాదేవ్‌పూర్ టింబర్ డిపోకు తరలించడం జరిగింది. పట్టుకున్న ఆరు టేకు దుంగల విలువ 1,50,000 విలువ ఉంటుందని పెగడపల్లి రేంజర్ సుష్మరావ్ తెలిపారు. కార్యక్రమంలో ఎఫ్‌ఎస్‌వోలు లక్ష్మణ్‌రావ్, రహామత్ఖాన్, ఫారేస్ట్ బీట్ ఆఫీసర్లు సురేందర్, శ్యామ్, అనిల్, రాజేందర్, సన్నీ, బేస్క్యాంఫ్ సిబ్బంది పాల్గొన్నారు.