హయత్‌నగర్ రూరల్ : గుర్తు తెలియని వాహనం బైక్ ఢీకొన్న సంఘటన అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. సీఐ స్వామి కథనం ప్రకారం.. గుంటోజు వంశీచారి (25) శనివారం రాత్రి బైక్‌పై మజీద్‌పూర్ నుంచి బాటసింగారం వెళ్తుండగా.. కోల్డ్ స్టోరేజీ వద్దకు రాగానే వెనుక నుంచి అతివేగంగా వచ్చిన గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. బైక్‌పై నుంచి కిందపడ్డ వంశీచారి తలకు తీవ్ర గాయాలయ్యాయి.
వెంటనే హయత్‌నగర్‌లోని దవాఖానకు తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. వంశీ సోదరుడు తేజాచారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ స్వామి తెలిపారు.