కాళేశ్వరం : మహదేవపూర్ మండలంలోని కాళేశ్వరం పుష్కరఘాట్ వద్ద గుర్తు తెలియని మృతదేహం లభ్యమైనట్లు ఎస్ఐ సాయి ప్రసన్నకూమర్ తెలిపారు. శుక్రవారం ఉదయం గోదావరి వద్ద గుర్తు తెలియని మృతదేహం ఉందని భక్తులు, స్థానికులు సమాచారం ఇవ్వడంతో గోదావరి నది వద్దకు చేరుకొని మత్స్యకారుల సహాయంతో మృతదేహన్ని గోదావరి నుంచి బయటకు తీసి పరిశీలించారు. ఆమె సుమారు 80సంవత్సరాలు ఉంటుందని, ఎరుపు రంగు చీర, మేడలో గోట్టల కుతికట్టు, రెండు చేతులకు వెండి కడియలు, చెవులకు రింగు కమ్మలు ధరించి ఉన్నట్లు తెలిపారు. వృద్ధురాలిని గుర్తుపట్టిన వారు కాళేశ్వరం పోలీసులకు సమచారం ఇవ్వలని కోరారు.