హైదరాబాద్: వరుస హత్యలకు పాల్పడిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. హబీబ్ నగర్, నాంపల్లిలో ఇద్దరు యాచకులను కదిన్ అనే వ్యక్తి దారుణంగా హత్య చేశాడు.
ఈ రెండు హత్యలను అతను ఒకే రోజు చేసినట్లు పోలీసులు తెలిపారు. గతంలో కూడా ఒక హత్య చేసిన కేసులో అతని నిందితుడిగా ఉన్నట్లు వెల్లడించారు. అతనిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.