రోడ్డుపై వెళ్లే సమయంలో ఒక్కోసారి అర్జెంటుగా వెళ్తుంటాం. హారన్ కొట్టి వేగంగా ముందుకు వెళ్లడానికి ప్రయత్నిస్తాం. అదే మాదిరి ముందుకు వెళ్లడానికి ప్రయత్నించిన ఒక వ్యక్తిని కాల్చి చంపాడు ఒక దుర్మార్గుడు. ఈ ఘటన బిహార్‌లోని ఔరంగాబాద్‌లో వెలుగు చూసింది. సంజిత్ కుమార్ సింగ్ అనే వ్యక్తి.. తన బావ ప్రీ-వెడ్డింగ్ ప్రోగ్రామ్‌కు వెళ్లి వస్తున్నాడు.
ఈ క్రమంలో త్వరగా ఇంటికి వెళ్లాలని అనుకున్నాడు. దాంతో హారన్ కొడుతూ కారుకు దారి ఇవ్వాలని కోరాడు. ఇదే సమయంలో రోడ్డుపై ఉన్న సంతోష్ కుమార్ సింగ్‌కు కోపం వచ్చింది. తనను పక్కకు వెళ్లమన్నాడనే కోపంతో.. సంజిత్ను కాల్చి చంపాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.