జయశంకర్భూపాలపల్లి, (నమస్తే తెలంగాణ) /పరకాల, సెప్టెంబర్ 5 : కాంగ్రెస్ వెయ్యి రోజుల దగా పాలనపై జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో బీఆర్ఎస్ శ్రేణులు, విద్యార్థులతో కలిసి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి నిరసనలకు సన్నద్ధం కాగా మొదట అనుమతి ఇచ్చిన పోలీసులు, తీరా ఆందోళన చేపట్టే సమయంలో స్థానిక ఎమ్మెల్యే ఒత్తిడితో అడ్డుకున్నారు. కాంగ్రెస్ విజయోత్సవ ర్యాలీ జరుగుతున్నంతసేపు బీఆర్ఎస్ శ్రేణులను ఊర్వశి థియేటర్ ఆవరణలో 5 గంటలపాటు నిర్బంధించారు.
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు కావాలనే ర్యాలీ చేపట్టి, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చే స్తున్నాడని గండ్ర వెంకటరమణారెడ్డి మండిపడ్డారు. హనుమకొండ జిల్లా పరకా ల పట్టణం అంబేదర్ సెంటర్లో బీఆర్ఎ స్వీ చేపట్టిన ఆందోళనకు పాలిటెక్నిక్ విద్యార్థులు సంఘీభావం తెలిపారు. ధర్నా లో పాల్గ్గొన్న మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు యత్నించడంతో ఉద్రిక్తత నెలకొన్నది.