కన్న తండ్రే కీచకుడిగా మారి కూతురిని లైంగికంగా వేధించేవాడు. తన బాధను ఎవరికి చెప్పుకోవాలో ఆ అమ్మాయికి తెలియలేదు. అసలు ఎవరైనా తన మాట నమ్ముతారా? అనే అనుమానం కలిగింది. ఎందుకంటో తల్లికి ఈ విషయం చెప్పి ఏడిస్తే.. ఆ తల్లి రియాక్షన్ అలా ఉంది మరి. భర్తను ఏమీ అనలేదు సరికదా.. కూతురే తప్పు చేసిందని, తండ్రిని రెచ్చగొడుతోందని ఆమె తిట్టిపోసింది.
దీంతో ఖంగుతిన్న అమ్మాయి.. ఎలాగైనా తండ్రికి వ్యతిరేకంగా సాక్ష్యాలు సంపాదించాలని, పోలీసులకు ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకుంది. దానికి కూడా తనే ఎరగా మారింది. తండ్రి వచ్చి మరోసారి తనను లైంగికంగా వేధిస్తున్నప్పుడు రహస్యంగా వీడియో తీసింది. ఆ వీడియో తీసుకొని పోలీసులను ఆశ్రయించింది.
అది చూసిన పోలీసులు ఆ తండ్రిపై కేసు నమోదు చేసుకున్నారు. ఆ వీడియోలో ఉన్న దాని కన్నా దారుణంగా తనపై ప్రతిరోజై లైంగిక వేధింపులు జరిగేవని ఆ అమ్మాయి పోలీసుల ముందు వాపోయింది. ఈ ఘటన బిహార్లోని రోస్రా ప్రాంతంలో వెలుగు చూసింది. దీనిపై మరింత దర్యాప్తు చేస్తున్నామని, ఆ తర్వాత తగిన చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు తెలిపారు.