మొయినాబాద్ :అతివేగంతో వెళ్తున్నకారుకు కుక్క అడ్డం రావడంతో దానిని తప్పించబోయి పల్టీలు కొడుతూ తోటలోకి దూసుకెళ్లింది. ఈ సంఘటన మర్తుజాగూడ సమీపంలో అమ్డాపూర్ రోడ్డుపై గురువారం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. మండల పరిధిలోని ఓ ప్రైవేట్ మెడికల్ కళాశాలకు చెందిన ఐదుగురు విద్యార్థులు కారులో అమ్డాపూర్ వైపు వెళ్తున్నారు. అతివేగంగా వెళ్తున్న వారి కారుకు కుక్క అడ్డం రావడంతో దానిని తప్పించబోయి ఢీకొట్టి రోడ్డు పక్కనే ఆరు అడుగుల లోతులో ఉన్న గులాబీ తోటలోకి కారు పల్టీలు కొడుతూ దూసుకెళ్లింది. కారులో ఉన్న ఐదుగురు విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి.
వారిని వెంటనే దవాఖానకు తరలించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.