Crime : పోలీసులకే సవాలు విసిరాడు …

నేరేడుచర్ల : దొంగతనాలు జరగకుండా చూడాల్సిన పోలీస్ ఇంట్లోనే దొంగతనం చేసి బంగారం, నగదు అపహరించకపోయి పోలీసులకే సవాలు విసిరాడు ఓ దొంగ. ఈ సంఘటన నేరేడుచర్ల పట్టణంలో మంగళవారం తెల్లవారు జామున చోటు చేసుకొంది. సంఘటనకు సంబంధించి బాధితులు తెలిపిన వివరాల ఇలా ఉన్నాయి. పాలకవీడు మండల పోలీస్ స్టేషన్లో కానిస్టేబులుగా విధులు నిర్వహిస్తున్న బురి ఉపేందర్ పట్టణంలోని ప్రగతి ఇంగ్లీష్ మీడియం స్కూల్ వెనుక భాగంలోని అద్ధె గృహంలో కుటుంబంతో నివసిస్తున్నాడు. ఉపేందర్ సోమవారం నైట్ డ్యూటీకి వెళ్లగా భార్య కోటేశ్వరి కోదాడలోని బంధువుల ఫంక్షన్‌కు వెళ్లింది. మంగళవారం తెల్లవారు జామున ఇంటి తలుపు గడియ విరగొట్టిలోనికి చొరబడ్డ దుండగులు బీరువలోంచి రూ. 4లక్షల నగదు, 25 తులాల బంగారాన్ని దోచుకెళ్లారు.
తాళం పగులగొట్టి తలుపులు తీసి ఉంచిన విషయాన్ని గమనించిన పక్క ఇంటి వారు కానిస్టేబుల్ ఉపేందర్‌కు సమాచారం అందించారు. గృహానికి వచ్చిన ఉపేదర్ నేరేడుచర్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నేరేడుచర్ల ఎస్ఐ నవీన్‌కుమార్, హుజూర్నగర్ సీఐ రామలింగారెడ్డిలు సంఘటనా స్థలాన్ని సందర్శించి క్లూస్ టీం రప్పించి ఆధారాలు సేకరించారు. కానిస్టేబుల్ ఉపేందర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు నేరేడుచర్ల ఎస్ఐ తెలిపారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
PM Modi | ప్రభుత్వం మారినా రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తాం.. తమిళనాడులో ప్రధాని మోదీ
Iran Warning | యెమెన్ విషయంలో జోక్యం వద్దు.. పాకిస్థాన్‌కు ఇరాన్ వార్నింగ్..!
Farmers Protest | కరెంట్ కోతలను నిరసిస్తూ సబ్‌స్టేషన్ వద్ద రైతుల వంటవార్పు
truck rams Durga idol procession | దుర్గా విగ్రహం ఊరేగింపుపైకి దూసుకెళ్లిన లారీ.. ముగ్గురు మృతి, పది మందికి గాయాలు
CJP Leaders | పౌరులపై మోదీ ప్రభుత్వం యుద్ధం చేస్తోంది.. ఇది బహిరంగ ఎమర్జెన్సీ.. సీజేపీ నేతల ఆరోపణ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

