పహాడీషరీఫ్ : భార్య భర్తల మధ్య గొడవల కారణంగా వేర్వేరు ఘటనల్లో ఇద్దరు మహిళలు అదృశ్యమయ్యారు. పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను ఎస్సై ప్రభులింగం వెల్లడించారు.
పోలీస్ స్టేషన్ పరిధిలోని పహాడీషరీఫ్‌లో నివసముంటున్న సలేహా భాను (27) భర్త సయ్యద్ యాసిన్ ల మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఈనెల 22న ఉదయం 7 గంటలకు ఇంటి నుంచి బయటకు వెళ్లిన భాను ఇంటికి తిరిగి రాలేదు.
అన్ని చోట్ల గాలించినా ఆచూకీ తెలియకపోవడంతో భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మరో ఘటనలో …
ఎస్సై శోభ వివరాల ప్రకారం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇమామ్గూడలో నివాసముంటున్న శిరీష (30) భర్త నాగరాజులు
చిన్న చిన్న సమస్యలతో గొడవ పడుతుండేవారు. ఈ నెల 21న కూడా వారిద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో నాగరాజు ఆమెను తల్లిగారింటికి పంపిస్తానని చెప్పాడు.
అయితే 22న ఉదయం 11 గంటలకు ఇంటి నుంచి బయటకు వెళ్లిన శిరీష ఇంటికి తిరిగి రాలేదు. భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.