జైపూర్ : జైపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఇందారం ఫారెస్టు చెక్‌పోస్టు వద్ద రాజీవ్‌రహదారిపై గురువారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మంచిర్యాల వేంపల్లి ప్రాంతానికి చెందిన ఏఆర్ కానిస్టేబుల్ ఆషాడం మల్లేశ్ (45) అక్కడికక్కడే మృతి చెందాడు. జైపూర్ ఎస్ఐ రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దపల్లి జిల్లా పెద్దరాతిపల్లి గ్రామానికి చెందిన మల్లేశ్ మంచిర్యాల వెంపల్లి ప్రాంతంలో సొంత అపార్ట్మెంట్లో నివాసముంటున్నాడు.
పెద్దపల్లి జిల్లా కలెక్టర్‌కు గన్‌మెన్‌గా విధులు నిర్వహిస్తున్న మల్లేశ్ గురువారం విధులు ముగించుకుని ద్విచక్రవాహనంపై మంచిర్యాలకు తిరిగి వెళ్తుండగా చెక్‌పోస్టు వద్ద పాలవ్యాను వెనుకవైపు నుంచి వచ్చి ఢీ కొనడంతో తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతదేహాన్ని మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.