హైదరాబాద్ : సికింద్రాబాద్ పరిధిలోని గోపాలపురం పోలీసు స్టేషన్లో దారుణం చోటు చేసుకుంది. పట్టపగలే గొలుసు దొంగతనం జరిగింది. ఉదయం 10.50 గంటల ప్రాంతంలో ఇద్దరు మహిళలు రోడ్డుపై నిల్చున్నారు. బ్లూ కలర్ టీ షర్ట్ ధరించిన ఓ వ్యక్తి అటుగా వచ్చి, ఓ మహిళ మెడలో ఉన్న బంగారం గొలుసును లాక్కెళ్లాడు.
అప్రమత్తమైన మహిళలు అతన్ని వెంబడించారు. అక్కడే ఉన్న ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ కూడా దొంగను పట్టుకునేందుకు పరుగెత్తిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. మొత్తానికి చైన్ స్నాచర్‌ను స్థానికులు పట్టుకుని, పోలీసులకు అప్పగించారు. బంగారం గొలుసును స్వాధీనం చేసుకుని, మహిళలకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
సికింద్రాబాద్ పరిధిలోని గోపాలపురం పోలీసు స్టేషన్ పరిధిలో పట్టపగలే రెచ్చిపోయిన చైన్ స్నాచర్.. pic.twitter.com/e5oC4BgDzG
— Namasthe Telangana (@ntdailyonline) October 14, 2022