అమరావతి : ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా ( NTR District ) కీసర టోల్ ప్లాజా వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో హైకోర్టు సీనియర్ న్యాయవాది బొద్దులూరి శ్రీనివాసరావు ( Advocate Srinivas Rao ) మృతి చెందారు. హైదరాబాద్ ( Hyderabad ) లోని ఎల్లారెడ్డిగూడలో నివాసముంటున్న న్యాయవాది విజయవాడ నుంచి హైదరాబాద్కు కారులో బయలు దేరారు. కీసర టోల్ ప్లాజా వద్ద టోల్ ఫీజు కట్టేందుకు కారును ఆపాడు.
అదే సమయంలో బ్రేక్లు ఫేయిలై, వేగంగా వచ్చిన సిమెంట్ యాష్ లారీ కారుపై బోల్తా పడింది. దీంతో కారు నుజ్జునుజ్జయ్యింది. అందులో ప్రయాణిస్తున్న న్యాయవాది అక్కడికక్కడే మృతి చెందారు. టోల్గేట్ సిబ్బంది కారుపై పడ్డ లారీని తీసేందుకు మూడు భారీ క్రేన్లను ఉపయోగించారు. న్యాయవాది మృతి పట్ల బార్ అసోసియేషన్ సభ్యులు సంతాపం వ్యక్తం చేశారు.