మంగళవారం 26 జనవరి 2021
Crime - Nov 03, 2020 , 12:44:06

షార్ట్ సర్క్యూట్‌తో పెంకుటిల్లు దగ్ధం

షార్ట్ సర్క్యూట్‌తో పెంకుటిల్లు దగ్ధం

ములుగు : జిల్లాలోని ఏటూరునాగారం మండల కేంద్రంలోని రెండో వార్డులో జరిగిన అగ్ని ప్రమాదంలో సమ్మక్క అనే వృద్ధురాలికి చెందిన పెంకుటిల్లు కరెంట్‌ షార్ట్ సర్క్యూట్‌తో దగ్ధమైంది. సుమారు నాలుగు లక్షల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు గ్రామస్తులు తెలిపారు. నిరుపేద కుటుంబానికి చెందిన బాధితురాలిని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.


logo