e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, October 21, 2021
Home News బుల్లెట్ గాయంతో బస్టాండ్‌లో విగ‌త‌జీవిగా క‌నిపించిన బాలుడు!

బుల్లెట్ గాయంతో బస్టాండ్‌లో విగ‌త‌జీవిగా క‌నిపించిన బాలుడు!

బెంగ‌ళూర్ : త‌ల‌పై బుల్లెట్ గాయంతో బెంగ‌ళూర్‌లోని సంజ‌య్ న‌గ‌ర్ బ‌స్టాండ్‌లో బాలుడు (17) విగత‌జీవిగా ప‌డిఉండ‌టాన్ని శుక్ర‌వారం పోలీసులు గుర్తించారు. బాలుడు ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడా లేక ఎవ‌రైనా అత‌డిని హ‌త్య చేశారా అనే వివ‌రాల‌ను పోలీసులు ఇంకా నిర్ధారించ‌లేదు. బాలుడి త‌ల‌పై కాల్పులు జ‌రిపిన 3.2 బోర్‌గ‌న్‌ను కూడా ఘ‌ట‌నా స్ధ‌లం నుంచి స్వాధీనం చేసుకున్నారు.

మృతుడిని ప‌ద‌వీవిర‌మ‌ణ చేసిన సైనికుడి కుమారుడిగా గుర్తించారు. ఉత్త‌రాఖండ్‌కు చెందిన‌ టీనేజ‌ర్ కుటుంబం కొన్నేండ్లుగా బెంగ‌ళూర్‌లో స్ధిర‌ప‌డింద‌ని చెబుతున్నారు. బాలుడు శుక్ర‌వారం తెల్ల‌వారుజామున నాలుగు గంట‌ల‌కు ఇంటి నుంచి బ‌య‌ట‌కువ‌చ్చిన బాలుడు త‌ర్వాత కుటుంబ‌స‌భ్యులు చేసిన ఫోన్‌కాల్స్‌ను లిఫ్ట్ చేయ‌లేదు. ఘ‌ట‌నా స్ధ‌లం నుంచి స్వాధీనం చేసుకున్న గ‌న్ అత‌డి తండ్రిద‌ని కుటుంబ స‌భ్య‌లు తెలిపారు. గ‌న్స్‌ను ఎలా వాడాలో బాలుడికి కూడా తెలుస‌ని కుటుంబ స‌భ్యులు చెబుతున్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement