ములుగు : జిల్లాలోని వాజేడు మండలం మురుమూరు గ్రామపంచాయతీ పరిధిలోని ప్రగళ్లపల్లి కి చెందిన పాయం సాయి లికిత్ (15) సోమవారం మధ్యాహ్నం ఇంట్లో నుంచి కనిపించకుండా పోయాడు. ఇటీవల పదోతరగతి పరీక్షలు రాసిన సాయి లిఖిత్ ఇంట్లోనే ఉంటున్నాడు. సోమవారం మధ్యాహ్నం ఇంటి నుంచి కూల్ డ్రింక్ తెచ్చుకుంటానని తల్లికి చెప్పి బయటకు వెళ్లి సాయంత్రం వరకు రాకపోవడంతో తల్లి పాయం సుశీల పోలీసులకు ఫిర్యాదు చేసింది.
పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా గ్రామం పక్కనే ఉన్న వెంకటాపురం (నూగూరు) మండల పరిధిలోని పాలెం వాగు ప్రాజెక్టులో మృతదేహం బుధవారం ఉదయం లభ్యమైంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. సాయి లిఖిత్ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.