హైదరాబాద్ : నగర శివార్లలోని శామీర్పేట చెరువులో ఓ నవజాత శిశువు మృతదేహాం లభ్యమైంది. శనివారం ఉదయం శిశువు మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. చెరువు వద్దకు చేరుకున్న పోలీసులు, శిశువు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. చిన్నారి వయసు 6 నెలలు మాత్రమే ఉంటుందని పోలీసులు నిర్ధారించారు.
అయితే బేబి బతికి ఉన్నప్పుడే చెరువులో పడేశారా? లేక చంపి మృతదేహాన్ని పడేశారా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మూడు రోజుల క్రితం ఈ ఘటన జరిగి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం డెడ్ బాడీని ఆస్పత్రికి తరలించారు.