మైక్రోఓవెన్లో 2 నెలల ఆడ శిశువు.. దారుణానికి పాల్పడిన తల్లి
న్యూఢిల్లీ : తనకు అమ్మాయి పుట్టిందనే కోపంతో ఓ తల్లి దారుణానికి పాల్పడింది. రెండు నెలల పసికందును మైక్రోఓవెన్లో పెట్టి చంపేసింది. ఈ దారుణ ఘటన ఢిల్లీలోని చిరాగ్ దిల్లీ ఏరియాలో సోమవారం వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. గుల్షాన్ కౌశిక్, డింపుల్ కౌశిక్ అనే దంపతులకు నాలుగేండ్ల కుమారుడు ఉన్నాడు. రెండు నెలల క్రితం వీరికి పాప జన్మించింది. అమ్మాయి పుట్టడం డింపుల్‌కు నచ్చలేదు. ఆ రోజు నుంచే చిన్నారిని తల్లి ఇష్టపడటం లేదు. ఈ క్రమంలో ఆ బిడ్డను మైక్రోఓవెన్లో పెట్టి చంపేసింది.
నానమ్మ చూడటంతో వెలుగులోకి..
అయితే పసిపాపను మైక్రోఓవెన్లో పెట్టిన దృశ్యాలను చిన్నారి నానమ్మ చూసింది. దీంతో ఆమె గట్టిగా అరిచేసరికి.. డింపుల్ లోపలి నుంచి డోర్ లాక్ చేసింది. ఇరుగుపొరుగు వారి సహాయంతో తలుపుబద్దలు కొట్టి లోపలికి వెళ్లి చూడగా, డింపుల్, నాలుగేండ్ల కుమారుడు మాత్రమే ఉన్నారు. మైక్రోఓవెన్లో ఉన్న శిశువును పరిశీలించగా, పాప చనిపోయింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. గుల్షాన్ కౌశిక్, డింపుల్ కౌశిక్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
- Tags
- Delhi
- delhi police
- Infant
- Microwave
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP protest | ఇంటర్నెట్ ఆపొద్దు.. మెట్రో రైళ్లు నడపండి.. సీజేపీ నిరసనల వేళ కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన
Tirumala | తిరుమలలో శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం
Assam Girl | అసోం యువతి మృతి కేసులో ట్విస్ట్.. రైల్వే ట్రాక్ పక్కనే మరో డెడ్‌బాడీ..!
Nepal Falsh Floods | నేపాల్‌లో మళ్లీ అకస్మిక వరద.. నేలమట్టమైన ఇళ్లు, బ్రిడ్జిలు..!
Digital arrest | డిజిటల్ అరెస్ట్ వలలో చిక్కి యువతి విలవిల.. రూ.2.5 లక్షలు పోగొట్టుకుని ఆత్మహత్య..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

