అమరావతి: ప్రకాశం జిల్లా గిద్దలూరులో దారుణం జరిగింది. శ్రీరాంనగర్ లో ఓ భార్య తన భర్తపైనే పెట్రోల్ పోసినిప్పంటించింది. ఈ ఘటన సోమవారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. గిద్దలూరులోని శ్రీరామ్ నగర్ లో తన భర్త చిరంజీవిని భార్య అంకాలమ్మ పెట్రోల్ పోసి తగలబెట్టింది. అనంతరం పోలీస్ స్టేషన్ లో లొంగిపోయింది.
ఈ ఘటనకు కుటుంబ కలహాలే కారణమని తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. కుటుంబ కలహాలే కారణమా ? లేక మరేదైనా కారణమా ? అనే కోణంలో విచారణ చేపట్టారు. వీరికి ముగ్గురు సంతానం ఉన్నట్లు సమాచారం.