ముంబై : కన్నబిడ్డను కిరాతకంగా కొట్టి చంపిన మహిళ ఉదంతం ముంబైలో వెలుగుచూసింది. నీళ్లతో ఆడుకుంటుందనే కోపంతో రెండేండ్ల కుమార్తెను కొట్టిచంపిన మహిళ(22)ను విరార్ పోలీసులు అరెస్ట్ చేశారు. పూల్పదా ప్రాంతంలో శనివారం ఈ ఘటన జరిగింది. గర్భిణి కూడా అయిన నిందితురాలు ఇంటిలోపల రెండేండ్ల చిన్నారి నీటితో ఆడుకుంటుండగా పసిబిడ్డ అని కూడా చూడకుండా తీవ్రంగా కొట్టింది.
తీవ్రగాయాలైన బాలికను దవాఖానకు తరలించగా అప్పటికే మరణించిందని వైద్యులు నిర్ధారించారు. మహిళ పొరుగున ఉండే వారు పోలీసులకు ఘటనపై సమాచారం ఇవ్వడంతో నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. ఆటో డ్రైవర్గా పనిచేసే మహిళ భర్త ఘటన జరిగిన సమయంలో ఇంట్లో లేడని పోలీసులు తెలిపారు.