బండ్లగూడ: చికిత్స పొందుతూ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై సమరం రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం ఈ నెల 23న పిల్లర్ నెంబర్ 218 వద్ద ఒక వ్యక్తి రోడ్డు పక్కన పడి ఉన్నాడన్న సమాచారం వచ్చింది.
దాంతో రాజేంద్రనగర్ పోలీసులు సంఘటన స్థలానికి చెరుకుని వ్యక్తిని పరిశీలించగా నీరసంగా కనిపించాడు. పోలీసులు 108 సిబ్బందికి సమాచారం అందించడంతో వారు అక్కడకు చేరుకుని అతన్ని ఉస్మానియా దవాఖానకు తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం ఆయన చనిపోయినట్లు వైద్య సిబ్బంది తెలిపారు. గుర్తు తెలియని మృతదేహంగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సమరం రెడ్డి తెలిపారు.