Raod Accident | రోడ్డు ప్రమాదంలో అడ్వకేట్ దశమంతరెడ్డి మృతి చెందారు. సిద్ధిపేటలోని రంగధాంపల్లి అమరవీరుల స్థూపం వద్ద బైక్ను లారీ ఢీకొట్టింది. దీంతో సీనియర్ అడ్వకేట్ దశమంతరెడ్డి అక్కడికక్కడే మృతి చెందారు. నంగునూరు మండలం ముండ్రాయి నుంచి సిద్ధిపేటకు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.