నాగర్‌కర్నూల్: రోడ్డుపై వేగంగా వెళ్తున్న కారు అదుపు తప్పి పక్కనే ఉన్న చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటన నాగర్‌కర్నూలు జిల్లా తెల్కపల్లి మండలంలో వెలుగు చూసింది. ఈ ప్రమాదంలో ఒకరు మరణించగా, నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయాలపాలైన వారిని ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.