Gayapadda Simham | టాలెంటెడ్ దర్శకుడు, నటుడు తరుణ్ భాస్కర్ (Tarun Bhascker) హీరోగా, ‘జాతిరత్నాలు’ బ్యూటీ ఫారియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోయిన్గా వస్తున్న తాజా చిత్రం ‘గాయపడ్డ సింహం’. ఈ సినిమాకు యువ దర్శకుడు కశ్యప్ శ్రీనివాస్ (Kashyap Srinivas) దర్శకత్వం వహిస్తుండగా.. మిత్రమండలి సినిమాతో మంచి హిట్ అందుకున్న సప్త అశ్వ మీడియా వర్క్స్ ఈ సినిమాను నిర్మించబోతుంది. ఈ చిత్రంలో సీనియర్ నటుడు జేడీ చక్రవర్తి కీలక పాత్రలో నటించబోతున్నట్లు సమాచారం. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్‌ని చిత్రబృందం విడుదల చేసింది. ఈ ఫస్ట్ లుక్ చూస్తుంటే.. అమెరికా వెళదాం అనుకున్న యువకుడికి ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ వలన ఎలాంటి పరిస్థితి వచ్చింది అనేది సినిమా కథ అని తెలుస్తుంది. ఇక ఈ సినిమా టీజర్‌ను ఫిబ్రవరి 09న విడుదల చేయబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. తరుణ్ భాస్కర్ గత సినిమాల కంటే భిన్నంగా ఇందులో కనిపించబోతున్నారని సమాచారం.
‘గాయపడ్డ సింహం’ నుంచి వచ్చే శ్వాస.. గర్జన కన్నా భయంకరంగా ఉంటుంది 🔥#TharunBhascker‘s next titled as #GaayaPaddaSimham – #GPS 🦁
Get ready for the GPS TRAISER on February 9th, 2026 💥
Don’t Laugh!!
It’s a Serious Matter 🤭 pic.twitter.com/9dhwdKhFwz— Sapta Aswa Media Works (@saptaaswamedia) February 6, 2026