దౌల్తాబాద్ : మండలంలోని నాగసార్ గ్రామ సమీపన ఓ బైక్ అదుపుతప్పి బోల్తాపడిన ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. ఎస్ఐ రమేశ్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మద్దూర్ మండలం జాధరావుపల్లి గ్రామానికి చెందిన కృష్ణయ్య(24) అక్కడికక్కడే మృతి చేందాడని, అలాగే మరో యువకుడు అంజి అపస్మారాక స్థితిలో ఉండటంతో వైద్యాసేవల నిమిత్తం హైదరాబాద్కు తరలించినట్లు ఎస్ఐ తెలిపారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.