హైదరాబాద్ : కూకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలోని బృందావన్ కాలనీలో విషాదం నెలకొంది. తల్లీకుమారుడు ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మృతులను జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లికి చెందిన సరళ(50), సందీప్(30)గా పోలీసులు గుర్తించారు. ఆర్థిక ఇబ్బందులతోనే తల్లీకుమారుడు ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.