సంగారెడ్డి : సంగారెడ్డి పట్టణంలోని మహబూబ్ సాగర్ చెరువులో పడి ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతి చెందాడు. ఈ సంఘటన శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. మృతి చెందిన ఉపాధ్యాయుడు నర్సింలు (45) గా పోలీసులు గుర్తించారు. నర్సింలు పుల్కల్ మండలంలోని బద్రి గూడెం ప్రభుత్వ ప్రైమరీ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. సంగారెడ్డి శాంతినగర్ లో నివాసం ఉంటున్న నర్సింలు రోజు ఉదయం చెరువు కట్టపై వాకింగ్ కోసం వెళ్లే వాడని కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రమాదవశాత్తు నీటిలో పడి మృతి చెందాడా లేక ఆత్మహత్య చేసుకున్నాడు అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పట్టణ సీఐ రమేష్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి కొడుకు, భార్య ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
సమస్త జీవకోటికి మొక్కలే ప్రాణాధారం
పల్లె ప్రగతికి సహకరిద్దాం పర్యావరణాన్ని కాపాడుకుందాం
న్యూజిలాండ్ సెలబ్రేషన్స్ చూసి తట్టుకోలేకపోయాం: అశ్విన్