Kothuru | కొత్తూరు, ఏప్రిల్ 30 : ఓ బాలికపై అత్యాచారానికి యత్నించిన ఇద్దరిని కొత్తూరు పోలీసులు రిమాండ్‌కు తరలించారు. ఈ సంఘటన కొత్తూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని పెంజర్లలో చోటు చేసుకుంది. కొత్తూరు పోలీసుల వివరాల ప్రకారం.. మండల పరిధిలోని పెంజర్లలో ఏప్రిల్ 28న బాలిక ఇంట్లో ఉండగా అదే గ్రామానికి చెందిన బీర్ల రమేశ్, గోదా కృష్ణయ్య ఆమె ఇంట్లోకి ప్రవేశించారు.
లైంగిక కోరిక తీర్చుకోవాలనే ఉద్దేశంతో బాలికపై బలత్కారం చేయడానికి ప్రయత్నించారు. దీంతో బాలిక వారి నుంచి తప్పించుకొని పక్కింటి వారికి చెప్పింది. అయితే చిన్నారికి తల్లిలేదు. తండ్రి తాగుడుకు బానిసయ్యాడు. నాయినమ్మ ఉన్నప్పటికీ ఆమె గుడ్డిది. దీంతో పక్కింటి వారి ఫిర్యాదు మేరకు కొత్తూరు పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను పట్టుకునేందుకు సీఐ నరసింహారావు ఓ టీమ్‌ను ఏర్పాటు చేశారు. పోలీసులు గాలింపు చేపట్టి బీర్ల రమేశ్, గోదా కృష్ణయ్యను అదుపులోకి తీసుకొని రిమాండ్ తరలించారు.