Mobile Games | మొబైల్ గేమ్స్‌పై రూ. 52 లక్షలు తగలేసిన బాలిక : తల్లి అకౌంట్లో రూ. 5 మిగిల్చింది..!
ఆన్లైన్ గేమ్స్‌కు చిన్నారులు ఎంతలా బానిసలయ్యారంటే చైనాలో 13 ఏండ్ల బాలిక నాలుగు నెలల్లో కుటుంబ సేవింగ్స్ అన్నింటినీ తుడిచిపెట్టేస్తూ మొబైల్ గేమ్స్‌పై (Mobile Games) డబ్బు తగలేసింది.
బీజింగ్ : ఆన్లైన్ గేమ్స్‌కు చిన్నారులు ఎంతలా బానిసలయ్యారంటే చైనాలో 13 ఏండ్ల బాలిక నాలుగు నెలల్లో కుటుంబ సేవింగ్స్ అన్నింటినీ తుడిచిపెట్టేస్తూ మొబైల్ గేమ్స్‌పై (Mobile Games) డబ్బు తగలేసింది. ఈ కాలంలో బాలిక తన తల్లి ఖాతాలో కేవలం రూ. 5 మిగిల్చి ఏకంగా 4.49 లక్షల యువాన్ల (రూ. 52 లక్షలు)ను ఖర్చు చేసింది. గేమ్‌ను మెరుగ్గా ఆడేందుకు పెయిడ్ టూల్స్‌ను వాడాలని చాలా గేమ్స్ యూజర్లను ప్రోత్సహిస్తుంటాయి.
స్కూల్లో అధిక సమయం మొబైల్‌పై బాలిక గడుపుతుండటం టీచర్ గమనించడంతో ఈ విషయం బయటపడింది. పే టూ ప్లే గేమ్స్‌కు బాలిక బానిసైందని గుర్తించిన టీచర్ బాలిక తల్లిని అప్రమత్తం చేసింది. బాలిక తల్లి వాంగ్ తన బ్యాంక్ ఖాతాను చెక్ చేసుకోగా అందులో కేవలం 0.5 యువాన్ (రూ. 5) ఉన్నట్టు తేలడంతో కంగుతింది. బ్యాంక్ స్టేట్మెంట్లను చూసి వాంగ్ కన్నీరుమున్నీరైంది. మొబైల్ గేమ్స్‌కు చేసిన పలు చెల్లింపులు స్టేట్మెంట్లో నమోదయ్యాయి.
తన క్లాస్మేట్స్ గేమ్స్‌కు కూడా తాను చెల్లించానని బాలిక చెప్పుకొచ్చింది. డబ్బు గురించి తనకేమీ తెలియదని, అది ఎలా వస్తుందో కూడా అవగాహన లేదని బాలిక తెలిపింది. ఇంటిలో డెబిట్ కార్డు కనిపించడంతో దాన్ని తన స్మార్ట్‌ఫోన్‌కు కనెక్ట్ చేసుకున్నానని, దాని పాస్‌వర్డ్‌ను తల్లి తనకు చెప్పిందని బాలిక చెప్పడం గమనార్హం. తల్లికి అనుమానం రాకుండా తన స్మార్ట్‌ఫోన్‌లో మొబైల్ గేమ్స్ లావాదేవీలకు సంబంధించిన రికార్డులన్నింటినీ డిలీట్ చేశానని బాలిక తెలిపింది.
Read More
Road accident | వాహనాన్ని ఢీకొట్టిన సిమెంట్ ట్యాంకర్.. ఏడుగురు మృతి
Read Today's Latest Crime News in Telugu and Telugu News
- Tags
- china
- Girl
- mobile games
RELATED ARTICLES
తాజా వార్తలు
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. మేజిస్ట్రేట్ ముందు సీజేపీ నేతలు హాజరు..!
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

