Road accident | వాహనాన్ని ఢీకొట్టిన సిమెంట్ ట్యాంకర్.. ఏడుగురు మృతి
Road accident | అదుపు తప్పిన సిమెంట్ ట్యాంకర్ ఒక వాహనాన్ని ఢీకొట్టి బోల్తాపడింది. వాహనంలో ప్రయాణిస్తున్న వారిలో ఆరుగురు వ్యక్తులతోపాటు స్కూటీపై వెళ్తూ రెండింటి మధ్య నలిగిన మరో వ్యక్తి కూడా చనిపోయాడు.
భోపాల్: అదుపు తప్పిన సిమెంట్ ట్యాంకర్ ఒక వాహనాన్ని ఢీకొట్టి బోల్తాపడింది. వాహనంలో ప్రయాణిస్తున్న వారిలో ఆరుగురు వ్యక్తులతోపాటు స్కూటీపై వెళ్తూ రెండింటి మధ్య నలిగిన మరో వ్యక్తి కూడా చనిపోయాడు. మధ్యప్రదేశ్‌లోని సిద్ధి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. మద్వాస్ ప్రాంతంలోని డోల్ గ్రామంలో గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సిమెంట్ కలిగిన పెద్ద ట్యాంకర్ వాహనం నియంత్రణ కోల్పోయింది. బొలెరో వాహనాన్ని ఢీకొట్టి దానిపై బోల్తాపడింది. ఈ ప్రమాదంలో బొలెరో వాహనంలో ప్రయాణించిన ఎనిమిది మందిలో ఆరుగురు చనిపోయారు. అలాగే స్కూటీపై వెళ్తున్న ఒక వ్యక్తి కూడా సిమెంట్ ట్యాంకర్, బొలెరో వాహనం మధ్య నలిగి మరణించాడు.
కాగా, ఈ ప్రమాదం గురించి తెలిసిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బొలెరో వాహనంలో చిక్కుకున్న మృతదేహాలను బయటకు తీశారు. మృతుల్లో చాలా మంది ఒకే కుటుంబానికి చెందిన వారుగా గుర్తించారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Thulabharam | రవితేజ, వివేక్ ఆత్రేయ క్రేజీ కాంబో.. ‘తులాభారం’ టైటిల్ గ్లింప్స్ వచ్చేసింది!
Prabhas Birthday | ప్రభాస్ బర్త్‌డే కానుక.. థియేటర్లలో సందడి చేయనున్న డార్లింగ్ బ్లాక్‌బస్టర్ మూవీస్ ‘వర్షం’, ‘ఛత్రపతి’!
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

