వనపర్తి : కారు అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లిన ఘటన జిల్లాలోని ఆత్మకూరు మండలం మూలమల్ల గ్రామంలో చోటుచేసుకున్నది. వివరాలు ఇలా ఉన్నాయి. ఆత్మకూరు పట్టణంలోని అనంతలక్ష్మి మెడికల్ ఏజెన్సీకి చెందిన కారులో అదే ఏజెన్సీలో పనిచేస్తున్న ఉద్యోగి చంద్రకుమార్ మూలమల్ల నుంచి ఆత్మకూరుకు ఆదివారం బయలుదేరాడు. మూలమల్ల గ్రామ సమీపంలోకి రాగానే అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లింది.
చంద్రకుమార్ చాకచక్యంతో వ్యవహరించడంతో స్వల్పగాయాలతో బయపడ్డాడు. రోడ్డుపై బర్రెలు అడ్డంగా రావడంతో వాటిని తప్పించే క్రమంలో అదుపుతప్పి కారు చెరువులోకి దూసుకెళ్లినట్లు ఆయన తెలిపారు. జేసీబీ సాయంతో కారును చెరువులోంచి బయటకు తీశారు.